28, మే 2009, గురువారం

మీకు బుడుగు తెల్సా?
ఏంటి అలా చికాగ్గా ముఖం పెట్టారు..నేను మీకు తెల్సా ? సిన్మా గుర్తుకొచ్చిందా ... లే లే ...వద్దమ్మా వద్దు ఆ సిన్మా ఊహల జోలికి కూడా వెళ్ళద్దు...స్మీ
హిక్కడ బుడుగు అంటే మన బాపు గారి బుడుగన్న మాట ...అంటే మన రమణ గారి బుడుగు...
వాళ్ల బాబాయి వాళ్ల బుడుగు...అంటే మన రెండుజెళ్ళ సీత బాయ్ ఫ్రెండ్ ..బాబాయి ఉన్నాడే ...వాళ్ల బుడుగు ...ఇంక చెప్పాలంటే వాళ్ల అమ్మ నాన్నల బుడుగర్రా...!
అసలు మీ అందరికి ప్రెవేటు చెప్పించాలి బుడుగు వాళ్ల బామ్మ చేత ......బుడుగెవరో తెలీదన్నందుకు ...

27, మే 2009, బుధవారం

సభకి నమస్కారం (ఎక్సూస్ మీ జయలెలిత గ్యాపకం గాని వస్తుందేంటి కొంప దీసి హన్నా )

ఏంటీ ఈ బ్లాగు కి ఇలాటి పేరెంటని హచ్చేర్య పోతున్నారా...

మా మామ్మ నాకు పెట్టిన ముద్దు పేరు బుజ్జి ....మరి అదే ఇప్పటికి కంటిన్యూ అయిపోతున్నది ఆ పేరుతొ ఇక్కడ వెదికితే దొరకలేదు మరి మా అబ్బాయి పేరుమీద చూస్తె (అదే బుడుగు) మరి బుక్కైపోయై .మరి నాకు ఒక్క సారి వెలిగింది లైటూ మరి పెట్టేసా ఈ పేరు ..బుడుగు సన్నాఫ్ బుజ్జి అని ....